Asianet News TeluguAsianet News Telugu

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు... స్వర్ణకవచాలంకృత అలంకారంలో దుర్గమ్మ

విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

First Published Sep 26, 2022, 10:51 AM IST | Last Updated Sep 26, 2022, 10:51 AM IST

విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రి వేడుకల్లో తొలిరోజయిన ఇవాళ అమ్మవారు స్వర్ణకవచాలాంకృత అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీ క్యూలైన్లలో వేచివున్నారు. భక్తులు, భవాని మాలదారుల దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. ఇక ఆనవాయితీ ప్రకారం అమ్మవారికి విజయవాడ పోలీసులే మొదట పట్టువస్త్రాలు సమర్పించారు. పోలీస్ కమీషనర్ దంపతులు వన్ టౌన్ నుండి సాంస్కృతిక కార్యక్రమాలు, మేళతాళాలతో ఆలయానికి వెళ్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.