దళిత ప్రతిఘటన ర్యాలీలో అపశృతి... రోడ్డుపైనే పడిపోయిన ఎస్సీ నేత
విజయవాడ: దళితులపై కక్షగట్టి దమనకాండ సాగిస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వ మెడలు వంచడానికంటూ ఇవాళ(మంగళవారం) తెలుగుదేశం పార్టీ దళిత ప్రతిఘటన ర్యాలీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా విజయవాడ జింఖానా మైదానంలోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం నుండి తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ప్రతిఘటన ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడంతో విఎంసి కళ్యాణ మండమం పైకెక్కి ఎస్సీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఎస్సీ నేత అంజనేయులు సృహ కోల్పోయాడు. దీంతో వెంటనే అతడికి హాస్పిటల్ కు తరలించారు.