Asianet News TeluguAsianet News Telugu

గాడిదకు జగన్ ఫోటో, చెప్పులదండ... కొడాలి నాని ఇలాకాలో దళిత మహిళ నిరసన

గుడివాడ : మాజీ మంత్రి, వైసిపి మాస్ లీడర్ కొడాలి నాని ఇలాకాలో ఓ దళిత మహిళ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.

First Published Nov 18, 2022, 10:25 AM IST | Last Updated Nov 18, 2022, 10:25 AM IST

గుడివాడ : మాజీ మంత్రి, వైసిపి మాస్ లీడర్ కొడాలి నాని ఇలాకాలో ఓ దళిత మహిళ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. దళిత సమాజానికి వైసిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అణచివేసే ప్రయత్నం చేస్తున్నారంటూ గుడివాడ మహిళ మండిపడ్డారు. దళితులకు అన్యాయం చేసిన సీఎం జగన్ గాడిదతో సమానమంటూ ఓ గాడిదకు జగన్  ఫోటో పెట్టి చెప్పులదండ వేసి నిరసన తెలిపారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వుండగా దళితులకు అన్యాయం చేస్తున్నందుకు ఆయనను నడిరోడ్డుపై ఉరితీయాలని ఈ గాడిద జగన్ అన్నయ్య అన్నారని మహిళ గుర్తుచేసారు. మరి జగన్  ముఖ్యమంత్రి అయ్యాక ఈ మూడేళ్లలో ఒక్క దళితునికి మేలు చేయలేదు... మరి ఈయనను దళితులు ఎన్నిసార్లు ఉరితియ్యాలని అడిగారు. దళితులను నమ్మించి మోసం చేసిన దిక్కుమాలిన సీఎం జగన్ అని మండిపడ్డారు. ఈ నెల 21న గుడివాడకు వస్తున్న జగన్ కు దళితులంటే ఏంటో చూపిస్తామని మహిళ హెచ్చరించారు.