Asianet News TeluguAsianet News Telugu

అమానుషం : దళిత మహిళను పొట్టలో తన్ని రేషన్ డీలర్..

ఆదోని మండలం చిన్న పెండేకల్ గ్రామంలో దళిత మహిళను ఓ రేషన్ షాపు డీలర్ కడుపులో తన్నిన ఘటన కలకలం రేపింది. 

ఆదోని మండలం చిన్న పెండేకల్ గ్రామంలో దళిత మహిళను ఓ రేషన్ షాపు డీలర్ కడుపులో తన్నిన ఘటన కలకలం రేపింది. ఎస్సీ కాలనీకి చెందిన తిక్కమ్మ అనే మహిళా రేషన్ కొరకు రేషన్ షాప్ కు వెళ్లగా ఆమె కన్నా వెనక వచ్చిన వాళ్లకు రేషన్ ఇవ్వడంతో ఆమె దాన్ని ప్రశ్నించింది. దీంతో కోపానికి వచ్చిన రేషన్ షాపు డీలర్ బోయ చిలక జయరాం ఆమెను దుర్భాషలాడి కడుపుపై కాలితో తన్నాడు. దీంతో  ఆమె అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే గ్రామస్తులు ఆమెను ఆదోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. విషయం తెలిసిన తిక్కమ్మ బంధువులు, కులస్తులు డీలర్ జయరామ్ ఇంటి దగ్గర ఆందోళన చేపట్టారు.