అన్నదాతలను నిండాముంచిన మాండూస్ తుపాను... నీటమునిగిన పంటలు
అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను ఆంధ్ర ప్రదేశ్ లోని అన్నదాతలను నిండాముంచాయి.
అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను ఆంధ్ర ప్రదేశ్ లోని అన్నదాతలను నిండాముంచాయి. ఈ తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలు చేతికందివచ్చే సమయంలో పంటలను నాశనం చేసి రైతులను తీవ్ర నష్టాన్ని మిగిలిస్తున్నాయి. ఇలా కృష్ణా జిల్లా దివిసీమలో వేలాది ఎకరాల్లో వరిపంట నీటమునిగింది. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి , చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో సుమారు 6వేల ఎకరాల్లో కోతకోసి పొలాల్లోనే పెట్టిన వరి నీటమునిగింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష ఎకరాలకు పైగా దెబ్బతిని వుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మాండూస్ తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.