గన్నవరం ఎయిర్ పోర్ట్ లో భారీగా గోల్డ్ స్మగ్లింగ్... సీఎం కార్యాలయ అధికారి భార్య పనేనా?
గన్నవరం : దుబాయ్ నుండి అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం ఆంధ్ర ప్రదేశ్ లో పట్టుబడినట్లు తెలుస్తోంది.
గన్నవరం : దుబాయ్ నుండి అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం ఆంధ్ర ప్రదేశ్ లో పట్టుబడినట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో నిన్న(గురువారం) సాయంత్రం విదేశాల నుండి వచ్చిన విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలి వద్ద అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. బంగారం స్మగ్లింగ్ కు పాల్పడిన మహిళ ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి భార్యగా ప్రచారం జరుగుతోంది. ఎయిర్ ఇండియాలో పనిచేసే ఇద్దరు ఉద్యోగుల ప్రమేయం కూడా వున్నట్లు అనుమానిస్తున్నారు. మహిళతో పాటు ఎయిరిండియా ఉద్యోగులను కూడా కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.