అభివృద్ది పనుల కోసం అమరావతి భూముల వేలం...: సీఆర్డిఏ కమీషనర్ వివేక్ యాదవ్
అమరావతి : వైసిపి ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతిలో ఆగిపోయిన అభివృద్ది పనులు హైకోర్టు ఆదేశాలతో తిరిగి ప్రారంభమయ్యాయి.
అమరావతి : వైసిపి ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతిలో ఆగిపోయిన అభివృద్ది పనులు హైకోర్టు ఆదేశాలతో తిరిగి ప్రారంభమయ్యాయి. ఇటీవల జోన్-4లో మౌలిక వసతుల కల్పన కోసం శంకుస్థాపన చేసిన సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ఇవాళ జోన్-5 పనులు ప్రారంభించారు. జోన్-5 లో B, C, D మూడు విభాగాలు ఉన్నాయని... ఈ మూడు ప్రదేశాల్లో మౌలికసధుపాయల కల్పన కొరకు శంకుస్థాపన చెయ్యడం జరిగిందని సీఆర్డిఎ కమీషనర్ తెలిపారు. దశల వారిగా అన్ని జోన్ల అభివృద్ధి చేస్తామని అన్నారు. సీఆర్డిఏ పరిధిలో చేపట్టే డెవలప్మెంట్ పనులకోసం చాలా వ్యయం కానుందని... దీనికోసం చాలా బ్యాంకులతో సమావేశాలు నిర్వహించడం జరిగిందని వివేక్ యాదవ్ తెలిపారు. సీఆర్డీఏ పరిధిలోని కొంత భూమి త్వరలో ఈ వేలం ద్వారా అమ్మనున్నట్లు తెలిపారు. ఈ వేలం ద్వారా వచ్చిన నిధులను అభివృద్ధి పనులకు వాడుతామని సీఆర్డిఏ కమీషనర్ తెలిపారు.