Asianet News TeluguAsianet News Telugu

నల్లాలకు నీటి మీటర్లు... విజయవాడలో సిపిఎం ఆందోళన

విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో నల్లాలకు నీటిమీటర్లు అమర్చడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ఆందోళనకు దిగింది.

First Published Dec 11, 2022, 12:58 PM IST | Last Updated Dec 11, 2022, 1:03 PM IST

విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో నల్లాలకు నీటిమీటర్లు అమర్చడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ఆందోళనకు దిగింది. విజయవాడ మధురానగర్, పసుపు తోటలో సిపిఎం నాయకులు పాదయాత్ర చేస్తూ ఇంటింటికి తిరిగి నీటిమీటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి సిపిఎం నాయకులు నిరసనకు దిగారు. 

మంచినీరు ప్రజల హక్కు, సరఫరా ప్రభుత్వ బాధ్యత... అలాంటిది దాన్ని కూడా ఆదాయ వనరుగా చూడటం ఏంటని సిపిఎం నాయకులు ప్రశ్నించారు. కృష్ణా నది తీరంలో ఇలా తాగునీటి నల్లాలకు మీటర్లు పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. నీటిమీటర్ల ఏర్పాటు నిలిపివేస్తూ మేయర్ ఆదేశాలు ఇవ్వాలని సిపిఎం నాయకులు కోరారు. నీటి మీటర్లకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమిస్తామని సిపిఎం నాయకులు హెచ్చరించారు.