విజయవాడలో చెత్త సమస్యపై ఆందోళన... సిపిఎం నాయకుల అరెస్ట్
విజయవాడలో చెత్త సమస్యను పరిష్కరించాలంటూ ఆందోళనకు దిగిన సిపిఐ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసారు.
విజయవాడలో చెత్త సమస్యను పరిష్కరించాలంటూ ఆందోళనకు దిగిన సిపిఐ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసారు. విజయవాడ నగరానికి చెందిన చెత్త డంపింగ్ యార్డులో కొద్దిరోజులుగా మంటలు వ్యాపిస్తుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదంటూ సీపీఎం నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వీరిని అరెస్ట్ చేసారు. ఇలా అరెస్టులతో పోరాటాలను ఆపలేరని సిపిఎం నేత బాబురావు అన్నారు.