Asianet News TeluguAsianet News Telugu

జమిలి ఎన్నికలపై సిపిఎం స్టాండ్ ఇదే...: బివి రాఘవులు క్లారిటీ

గుంటూరు : దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నట్లు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ప్రకటించారు.

గుంటూరు : దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నట్లు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ప్రకటించారు. బిజెపి స్వార్థ రాజకీయాల కోసమే జమిలి ఎన్నికలను తెరపైకి తీసుకువచ్చిందని అన్నారు. దేశానికి విచ్చిన్నకర శక్తిగా బిజెపి మారిందని... ఈ పార్టీని ఓడించడమే వామపక్షాల ప్రధాన కర్తవ్యమని రాఘవులు అన్నారు. తాడేపల్లిలో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర ప్లీనరీ సమావేశాల్లో రాఘవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటుచేసిన కేంద్రం కనీసం ఎజెండా ప్రకటించకపోవడంపై దారుణమన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు. ఇక ఇండియా పేరును మార్చడం కూడా దుర్మార్గపు చర్య అని... రాజ్యాంగంలో ఇండియా, భారత్ అనే రెండు పేర్లు పొందుపరిచి ఉన్నాయని రాఘవులు అన్నారు.