అమరావతి ఉద్యమానికి సిపిఎం మద్దతు... రైతుల పాదయాత్రకు మద్దతుగా బైక్ ర్యాలీ

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతి రైతులు ఈ నెల(సెప్టెంబర్) 12న ప్రారంభించనున్న పాదయాత్రకు సిపిఎం మద్దతు తెలిపింది.

First Published Sep 8, 2022, 1:49 PM IST | Last Updated Sep 8, 2022, 1:49 PM IST

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతి రైతులు ఈ నెల(సెప్టెంబర్) 12న ప్రారంభించనున్న పాదయాత్రకు సిపిఎం మద్దతు తెలిపింది. వైసిపి ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న రైతులు, మహిళలు పాదయాత్రకు సిద్దమయ్యారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి నుండి అరసవెల్లికి పాదయాత్ర చేపట్టాలన్న రైతులకు సిపిఎం మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలోనే రైతు పాదయాత్రకు సంఘీభావంగా ఉండవల్లి నుంచి అమరావతికి సిపిఎం భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి  శ్రీనివాసరావు ప్రారంభించారు.