Asianet News TeluguAsianet News Telugu

జగన్ పక్కా మోసగాడిగా చరిత్రలో నిలిచిపోతాడు..: సిపిఐ రామకృష్ణ

విజయవాడ : ముుఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

First Published Jul 20, 2022, 5:46 PM IST | Last Updated Jul 20, 2022, 5:46 PM IST

విజయవాడ : ముుఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ తీరువల్లే కేంద్రం కూడా నిర్భయంగా ఏపీకి అన్యాయం చేసేలా ఎటువంటి ప్రకటన అయినా చేస్తోందన్నారు. 25ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచుతానన్న జగన్  పక్కా మోసగాడిగా చరిత్రలో నిలిచిపోతాడని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కాళ్ల మీద సాకిల పడుతున్నాడు... కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు ఆలోచన చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా అందరం కలిసి ఐక్య ఉద్యమం సాగిస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని సిపిఐ రామకృష్ణ పేర్కొన్నారు.