Asianet News TeluguAsianet News Telugu

'సిపిఐ మావోయిస్ట్ ఆవిర్భావ వేడుకలు... అల్లూరి జిల్లాలో భద్రతా బలగాల హైఅలర్డ్

విశాఖపట్నం :  సిపిఐ (మావోయిస్ట్) ఆవిర్భావ వారోత్సవాల నేపథ్యంలో విశాఖ పోలీసులు అలర్ట్ అయ్యారు. 

First Published Sep 21, 2022, 11:39 AM IST | Last Updated Sep 21, 2022, 11:39 AM IST

విశాఖపట్నం :  సిపిఐ (మావోయిస్ట్) ఆవిర్భావ వారోత్సవాల నేపథ్యంలో విశాఖ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ వారోత్సవాలను భగ్నం చేసేందుకు అల్లూరి జిల్లాలో ప్రత్యేక పోలీస్, గ్రేహౌండ్స్, సిఆర్ఫిఎఫ్, ఏపీఎస్సి బలగాలను మొహరించినట్లు చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్ శివకిషోర్  తెలిపారు. మావోయిస్ట్ కదలికలపై ప్రత్యేక నిఘా వుందని... వారి ప్రభావం ఎక్కువగా వున్న ప్రాంతాల్లోని అడవిని ప్రత్యేక బలగాలు జల్లెడ పడుతున్నాయని అన్నారు. మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందన్నారు. కానీ ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మావోయిస్టులు జిల్లాలో ప్రవేశించే అవకాశాలున్నాయని... వారిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సంసిద్దంగా వున్నట్లు ఏఎస్పీ తెలిపారు.