Asianet News TeluguAsianet News Telugu

చెత్త పన్ను రద్దు డిమాండ్... నిరసనకు దిగిన సిపిఎం నాయకుల అరెస్ట్


విశాఖపట్నం: పెంచిన ఆస్థి పన్ను తగ్గింపు, చెత్త పై పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జివిఎంసి కార్యాలయం వద్ద  సిపిఎం నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. 


విశాఖపట్నం: పెంచిన ఆస్థి పన్ను తగ్గింపు, చెత్త పై పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జివిఎంసి కార్యాలయం వద్ద  సిపిఎం నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. ఇలా నిరసనకు దిగిన సిపిఎం శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో జివిఎంసి వద్ద కాస్సేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, నగర కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.కె.ఎస్.వి.కుమార్, జగన్, మద్దిలపాలెం జోన్ కార్యదర్శి వి.క్రిష్ణారావు, మాజీ కార్పోరేటర్ బొట్టా ఈశ్వరమ్మ సహా పలువురు అరెస్టయ్యారు.