Asianet News TeluguAsianet News Telugu

వైసిపి నాయకులు ప్రకృతిని సైతం రేప్ చేస్తున్నారు..: సిపిఐ నారాయణ

విశాఖపట్నం : వైసిపి ప్రభుత్వం విశాఖ నడిబొడ్డున సహజసిద్దమైన ప్రకృతి అందాలతో ఆకట్టుకునే రుషికొండను నాశనం చేస్తోందని సిపిఐ నాయకుడు నారాయణ ఆరోపించారు.

First Published Nov 25, 2022, 4:09 PM IST | Last Updated Nov 25, 2022, 4:09 PM IST

విశాఖపట్నం : వైసిపి ప్రభుత్వం విశాఖ నడిబొడ్డున సహజసిద్దమైన ప్రకృతి అందాలతో ఆకట్టుకునే రుషికొండను నాశనం చేస్తోందని సిపిఐ నాయకుడు నారాయణ ఆరోపించారు. ప్రకృతిని నాశనం చేస్తూ కొండను తవ్వి నిర్మాణాలు చేపట్టడాన్ని నారాయణ తప్పుబట్టారు. ఎన్ని కోట్లు పెట్టినా సహజసిద్దంగా ఏర్పడిన కొండలను నిర్మించగలమా? అలాంటిది రుషికొండను నాశనం చేసిమరీ నిర్మాణాలు చేపట్టడం ఏంటని ప్రశ్నించారు. వైసిపి నాయకులు ప్రకృతిని సైతం వదిలిపెట్టకుండా రేప్ చేస్తున్నారని నారాయణ మండిపడ్డారు. 

నేడు రుషి కొండను పరిశీలించేందుకు సిపిఐ నారాయణ సిద్దమైన నేపథ్యంలో విశాఖ పోలీసులు అప్రమత్తమయ్యారు. రుషికొండ ప్రాంతంతో భారీగా పోలీసులను మొహరించిన పోలీసులు సిపిఐ నాయకులతో కలిసి వెళుతున్న నారాయణను అడ్డుకున్నారు. కేవలం నారాయణ ఒక్కరినే రుషికొండ పరిశీలనకు అనుమతిస్తామంటూ ఆయనవెంట వున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఇతర నాయకులను వాహనంలోంచి దించేసారు.