పాతిపెట్టిన లారీ క్లీనర్ శవానికి కరోనా పరీక్షలు..
కృష్ణాజిల్లా స్మశానం లో పాతిపెట్టిన లారీ క్లీనర్ శవానికి తిరిగి కరోనా పరీక్షలు చేయనున్నారు.
కృష్ణాజిల్లా స్మశానం లో పాతిపెట్టిన లారీ క్లీనర్ శవానికి తిరిగి కరోనా పరీక్షలు చేయనున్నారు. మహారాష్ట్రలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన లారీ క్లీనర్ ను చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామ స్మశానం లో పాతి పెట్టారు. మహారాష్ట్ర నుండి రెడ్ జోన్ గా ప్రకటించిన ముప్పాళ్ళ గ్రామం దాటి ఒక లారీలో శవం తుర్లపాడు గ్రామానికి ఎలా వెళ్ళింది అని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పదంగా ఉన్నప్పుడుఎటువంటి కరోనా పరీక్షలు నిర్వహించకుండా శవాన్ని పూడ్చి పెట్టడం ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు తుర్లపాడు స్మశానవాటికలో పాతిపెట్టిన శవాన్ని బయటికి తీసి కరోనా పరీక్షలు నిర్వహించనున్న అధికారులు.