వివాహేతర సంబంధం... నడిరోడ్డుపై యువకున్ని చంపిన దంపతులు
ఒంగోలు: ఒంగోలు గాంధీ పార్కు వద్ద థామస్ అనే యువకుడిని పట్టపగలే దంపతులు అతి దారుణంగా హత్య చేశారు.
ఒంగోలు: ఒంగోలు గాంధీ పార్కు వద్ద థామస్ అనే యువకుడిని పట్టపగలే దంపతులు అతి దారుణంగా హత్య చేశారు. యువకుడిని చంపిన అనంతరం నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఒంగోలులోని ఓ వస్ర్తదుకాణంలో థామస్ పనిచేస్తున్నట్టు గుర్తించారు. హత్యకు సంబంధించిన సమాచారం అందినవెంటనే ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. థామస్‌కు ఉదయం ఫోన్‌కాల్ రావడంతో ఇంటి నుంచి హడావుడిగా బయటికి వచ్చాడని అతని తల్లిదండ్రులు తెలిపారు. పక్కా ప్రణాళికతోనే అతన్ని పార్కుకు రప్పించి హత్య చేసినట్లు ఆరోపించారు. నిందితుల్లో ఒకరైన మహిళకు థామస్‌కు గతంలో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.