కాలేజి స్టూడెంట్స్ తో వెట్టిచాకిరీ... ఉయ్యూరులో ఓ కార్పోరేట్ కాలేజి నిర్వాకమిదీ...
మచిలీపట్నం : చదువు, ర్యాంకుల పేరిట విద్యార్థులపై, ఫీజుల కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచే కార్పోరేట్ కాలేజీలు తాజాగా శ్రమదోపిడీకి కూడా సిద్దమయ్యాయి.
మచిలీపట్నం : చదువు, ర్యాంకుల పేరిట విద్యార్థులపై, ఫీజుల కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచే కార్పోరేట్ కాలేజీలు తాజాగా శ్రమదోపిడీకి కూడా సిద్దమయ్యాయి. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో నారాయణ జూనియర్ కాలేజి యాజమాన్యం విద్యార్థులతో చాకిరీ చేయిస్తున్న వీడియో బయటకు వచ్చింది. కలం పట్టించాల్సిన చేతులతో కట్టెలు మోయిస్తూ విద్యార్థులతో వెట్టిచాకిరీ చేయిస్తోంది కాలేజీ యాజమాన్యం. ఇలా విద్యార్థులతో చెత్తపనులు చేయిస్తున్న వీడియో బయటకు రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలను లక్షలు ఖర్చుపెట్టి కాలేజీకి పంపితే పాఠాలు చెప్పకుండా ఇలా చాకిరీ చేయించడం ఏమిటంటూ కాలేజీ యాజమాన్యంపై మండిపడుతున్నారు.