కరోనా శవాలను పూడ్చి.. బ్లీచింగ్ చల్లి.. పీపీఈ కిట్లను గాలికి వదిలేసిన సిబ్బంది...
కర్నూల్ శివారులోని జాతీయ రహదారి పక్కన రాత్రికి రాత్రి కరోనాతో చనిపోయినవారి మృత దేహాలు పూడ్చిపెట్టారు.
కర్నూల్ శివారులోని జాతీయ రహదారి పక్కన రాత్రికి రాత్రి కరోనాతో చనిపోయినవారి మృత దేహాలు పూడ్చిపెట్టారు. పూడ్చిన మట్టి పైన బ్లీచింగ్ పౌడర్ చల్లి, పీపీఈ కిట్లను తగుల బెట్టకుండా రోడ్డు మీదనే పారేసి వెళ్లారు. దీంతో మూడు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు కరోనామృతదేహాలను ఇక్కడ పూడ్చారని, మృతదేహాలను కుక్కలు నక్కలు ,పందులు తవ్వితే ఆ వైరస్ అన్ని గ్రామాలకు వ్యాపిస్తుందని భయపడుతున్నారు. మృతదేహాలను కాల్చకుండా మట్టిలో ఎందుకు పూడ్చుతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.