Asianet News TeluguAsianet News Telugu

కరోనాతో విషమించిన భర్త ఆరోగ్యం, ఆసుపత్రిలో బెడ్ ఇప్పించి తన భర్తను కాపాడాలని భార్య వేడుకోలు

గుంటూరు: అయ్యా..! ప్రాణాలు పోయేలా వున్నాయి... 

గుంటూరు: అయ్యా..! ప్రాణాలు పోయేలా వున్నాయి... దయచేసి వైద్యం అందేలా చూసి నన్న బ్రతికించండి... అంటూ ఓ కరోనా పేషెంట్ ఆవేధనతో వేడుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుంటూరు పట్టణంలోని రిలయన్స్ స్టోర్ సమీపంలో నివాసముండే పాశం శేషయ్యకు కరోనా సోకి ఆరోగ్య పరిస్థితి విషమించింది. శ్యాస తీసుకోవటం ఇబ్బందిగా మారటంతో మొదట స్ధానికంగా ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. పల్స్ రేటు పడిపోవడంతో అక్కడ వైద్యులు మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ బెడ్లు దొరకకపోవటంతో  వెనుదిరిగారు. గుంటూరు, నరసరావుపేటలో ఎక్కడ చికిత్స చేసేందుకు ఆసుపత్రులు అంగీకరించపోవడంతో ఇప్పుడు ఇంట్లోనే ప్రాణాపాయ స్ధితిలో ఉన్నాడు. వైద్య సహాయం కోసం ఎదురు చూస్తూ తనను కాపాడాలంటూ వేడుకుంటున్నాడు. 

Video Top Stories