కొన ఊపిరితో గిలగిల్లాడినా బ్రతికించిన... ఆనందయ్య కరోనా మందు
కృష్ణపట్నం: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని ఓ ఆయుర్వేద మందు చిటికెలో కట్టడిచేస్తోంది.
కృష్ణపట్నం: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని ఓ ఆయుర్వేద మందు చిటికెలో కట్టడిచేస్తోంది. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య అనే వ్యక్తి తయారుచేసిన కరోనా మందు ఎలా పనిచేస్తోందో తెలియజేసే సంఘటన ఇది. ఊపిరి అడని స్థితిలో వున్ప ఓ కరోనా రోగికొ ఆనందయ్య అందించే ఆయుర్వేదిక మందు ఇప్పించడానికి అతడి భార్య తీసుకువచ్చింది. అయితే కృష్ణపట్నంకు చేరుకునేసరికి అతడి పరిస్థితి మరింత దిగజారి ఆక్సిజన్ లెవల్స్ పూర్తిగా పడిపోయాయి. అటువంటి వ్యక్తికి వెంటనే ఆనందయ్య మందు వేయగానే లేచి కూర్చున్నాడు. కొన ఊపిరితో ఉన్న వ్యక్తి ఆరోగ్యం కూడా వెంటనే మెరుగుపడటంతో ఆనందయ్య మందు గొప్పతనం మరోసారి భయటపడింది.