40మంది స్టూడెంట్స్ తో వెళుతూ... లారీని ఢీకొన్న కాలేజీ బస్సు

కృష్ణా జిల్లా ఇబ్రహింపట్నం మండలం తుమ్మలపాలెం వద్ద ఇవాళ(గురువారం) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 

First Published Jan 20, 2022, 12:47 PM IST | Last Updated Jan 20, 2022, 12:47 PM IST

కృష్ణా జిల్లా ఇబ్రహింపట్నం మండలం తుమ్మలపాలెం వద్ద ఇవాళ(గురువారం) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న ఓ లారీకి కారు అడ్డురాగా తప్పించబోయిన డ్రైవర్ సడన్ బ్రేక్ వేసాడు. దీంతో లారీ వెనకాల వస్తున్న ఎం.వి.ఆర్ కాలేజీ బస్సు లారీని బలంగా ఢీకొట్టింది. తుమ్మలపాలెం క్రాస్ రోడ్డు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 40మంది విద్యార్థులున్నారు. అయితే విద్యార్ధులందరూ స్వల్ప గాయాలతో బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే  బస్సు డ్రైవర్ వెనకాల సీట్లో కూర్చున్న యువకుడికి తీవ్ర గాయాలవగా అతడికి వెంటనే హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.  ప్రమాదానికి గురయిన వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. దీంతో పోలీసులుఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసారు.