దారుణం.. కరోనా మృతదేహాన్ని కాల్చాలంటే ఓ రేటు.. పూడ్చాలంటే ఓ రేటు...

కరోనాతో చనిపోయినవారి అంత్యక్రియలకూ లక్షలు దోచుకుంటున్న వైనం కర్నూలులో బైటపడింది.  

First Published Aug 22, 2020, 10:35 AM IST | Last Updated Aug 22, 2020, 10:35 AM IST

కరోనాతో చనిపోయినవారి అంత్యక్రియలకూ లక్షలు దోచుకుంటున్న వైనం కర్నూలులో బైటపడింది.  మెల్బోర్న్ కు చెందిన కర్నూలు ఎన్నారై  తండ్రి కోవిద్ 19తో కన్నుమూశాడు. అంత్యక్రియలకు అతను 85వేల రూపాయలు చెల్లించాడు. తాను ఇక్కడికి రాలేకపోవడం ఇక్కడున్న తల్లికి ఏమీ తెలియకపోవడం, తమ్ముడు కోవిద్ బారిన పడి ఉండడంతో తండ్రి అంత్యక్రియలకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారు 85 వేలు డిమాండ్ చేశారని చెబుతున్నారు. అంతేకాదు కాల్చడానికి 85వేలని, పూడ్చడం అయితే 75వేలని రేటు అంటున్నాడు. మానవతాకోణంలో ఫ్రీగా చేయాల్సిన దహనసంస్కారాలు డబ్బులతోనా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.