గోదావరి జిల్లాలో సంక్రాంతి సందడి... కోళ్ళ కోసం ఎగబడుతున్న పందెంరాయుళ్ళ

రాజమండ్రి : ఆంధ్ర ప్రదేశ్ లో నెలరోజుల ముందే సంక్రాంతి సందడి మొదలయ్యింది.

First Published Dec 12, 2022, 4:12 PM IST | Last Updated Dec 12, 2022, 4:12 PM IST

రాజమండ్రి : ఆంధ్ర ప్రదేశ్ లో నెలరోజుల ముందే సంక్రాంతి సందడి మొదలయ్యింది. సంక్రాంతి పందేల కోసం పందెంరాయుళ్లు మంచి కోళ్ల కోసం వేట ప్రారంభించారు. దీంతో తూర్పు గోదావరి జిల్లా గోకవరం కోళ్ల సంతలో పండుగ వాతావరణం నెలకొంది. నర్సీపట్నం, భీమవరం, పాడేరు, బొబ్బిలి ఏజెన్సీ ప్రాంతాల నుండి వ్యాపారులు వివిధ జాతుల పందెం కోళ్లను ఈ సంతకు వ్యాపారులు తీసుకురాగా వాటిని కొనుగోలు చేసేందుకు ఎక్కడెక్కడి నుండో పందెంరాయుళ్లు తరలివచ్చారు. పందెంకోళ్లను చూసేందుకు కూడా గోకవరం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తరలిరావడంతో కోళ్లసంత సందడిగా మారింది. 

పందెం కోళ్ళ ధరలు చూసి సామాన్యులు అవాక్కవుతున్నారు. ఒక్కొక్క కోడి ధర 7 వేల నుండి 20 వేలు వరకు వుంది. అయినా వాటిని కొనుగోలు చేసేందుకు పందెంరాయుళ్లు ఆసక్తి చూపిస్తున్నారు. గోకవరం సంతకు గతేడాది కంటే అధికంగా పందెం కోళ్ల వ్యాపారం జరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు