పెట్రోల్ బంక్ సమీపంలో.. బొగ్గు లారీలో మంటలు..

విశాఖ నుండి బొగ్గు లోడుతో మహారాష్ట్ర వెళ్తున్న లారీ డీజిల్ కోసం ఆర్ఇసిఎస్ ఎదురుగా పెట్రోల్ బంకు వద్దకు వెళ్తుండగా టైర్ పంక్చరై లారీకి మంటలు అంటుకున్నాయి. 

First Published Apr 23, 2020, 4:45 PM IST | Last Updated Apr 23, 2020, 4:45 PM IST

విశాఖ నుండి బొగ్గు లోడుతో మహారాష్ట్ర వెళ్తున్న లారీ డీజిల్ కోసం ఆర్ఇసిఎస్ ఎదురుగా పెట్రోల్ బంకు వద్దకు వెళ్తుండగా టైర్ పంక్చరై లారీకి మంటలు అంటుకున్నాయి. గమనించిన స్థానికులు వెంటనే నీళ్లతో మంటలు ఆర్పుతూ ఫైరింజన్ కు కాల్ చేశారు. లారీలోని బొగ్గు పూర్తిగా దగ్ధం అయ్యింది. టైర్లు కాలిపోయి లారీకి బాగా నష్టమే జరిగింది. అయితే దగ్గర్లోనే పెట్రోల్ బంక్ ఉండడంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు.