వైఎస్సార్ బీమాపై సీఎం జగన్ సమీక్ష... కీలక నిర్ణయం
అమరావతి: వైఎస్సార్ బీమా పథకం అమలుపై అధికారులతో క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
అమరావతి: వైఎస్సార్ బీమా పథకం అమలుపై అధికారులతో క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కుటుంబం ఆదారపడి వున్న వ్యక్తి (18-50ఏళ్లు) సహజంగా మరణిస్తే లక్ష, 18-70ఏళ్లు ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణస్తే రూ. 5లక్షల సాయం అందజేయాలని ఆదేశించారు. రైతుల మరణాలు, ప్రమాదవశాత్తూ మత్స్యకారులు మరణించినా, పాడిపశువులు మరణించినా తదితర వాటికి ఇచ్చే బీమా పరిహారాలన్నీకూడా దరఖాస్తు అందిన నెలరోజుల్లోగా చెల్లించాలని సీఎం ఆదేశించారు. దీనికోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం జగన్ ఆదేశించారు.