చిన్నారులకు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్... ప్రారంభించిన సీఎం జగన్
అమరావతి: పిల్లలలో న్యుమోనియా మరణాల నివారణకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. బుధవారం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో న్యుమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్(పీసీవీ) డ్రైవ్ ను వైద్యారోగ్య శాఖ ప్రారంభించింది. కొందరు చిన్నారులకు సీఎం జగన్ సమక్షంలో పీసీవీ వ్యాక్సిన్ వేసారు వైద్య సిబ్బంది. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.