Asianet News TeluguAsianet News Telugu
breaking news image

గుడివాడ ప్రజలకు శుభవార్త... భారీ నిధులతో ప్లైఓవర్ల నిర్మాణం, రేపే శంకుస్థాపన

 
విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడ ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్దమయ్యాయి. 

 
విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడ ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్దమయ్యాయి. గుడివాడలోని రైల్వే లైన్లపై రూ.320 కోట్లతో ప్లైఓవర్ల నిర్మాణానికి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 17న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్లైఓవర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్లైఓవర్ల నిర్మాణ ప్రాంతాన్ని ఎంపీ వల్లభనేని బాలశౌరి, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే  కైలె అనిల్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నాని మాట్లాడుతూ... ఈ ప్లైఓవర్ల నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తానన్నారు. ఇవి పూర్తి చేసుకునే ఎన్నికలకు వెళతానని మంత్రి నాని పేర్కొన్నారు.