రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలకు నిధుల సమీకరణపై సీఎం జగన్ సమీక్ష
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నాడు–నేడు, సాగునీటి తదితర ప్రాజెక్టుల నిధులపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్షా చేసారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నాడు–నేడు, సాగునీటి తదితర ప్రాజెక్టుల నిధులపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్షా చేసారు .ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్న వీటి విషయంలో ఎక్కడా నిధులకు కొరత రాకుండా పటిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సీఎం ఆదేశించారు. నిధుల అనుసంధానంపై నిర్దిష్ట సమయంతో లక్ష్యాలను పెట్టుకుని కచ్చితమైన ప్రణాళికతో అడుగులు ముందుకేయాలని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రాధాన్యతలుగా నిర్దేశించిన వివిధ శాఖల్లో చేపట్టిన కార్యక్రమాల పురోగతి, వాటికి చేస్తున్న ఖర్చు, సమీకరించాల్సిన నిధులు విషయంలో సీఎం అధికారులతో సమగ్రంగా సమీక్ష చేశారు.