Asianet News TeluguAsianet News Telugu

విశాఖ శారదా పీఠాన్ని సందర్శించిన సీఎం వైయస్ జగన్ (వీడియో)

శాఖపట్టణం:  ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం నాడు విశాఖ పట్టణం చేరుకొన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత జగన్ తొలిసారిగా విశాఖకు వచ్చారు.

విశాఖపట్టణం:  ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం నాడు విశాఖ పట్టణం చేరుకొన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత జగన్ తొలిసారిగా విశాఖకు వచ్చారు.

ప్రత్యేక విమానంలో వైఎస్ జగన్ విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొన్నారు.  విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుండి నేరుగా ఆయన శారదా పీఠానికి వెళ్లారు.శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రతో జగన్ భేటీ అయ్యారు. శారదా పీఠానికి చేరుకొన్న జగన్ వెంటనే పంచె కట్టుకొని శారదా పీఠాధిపతి స్వరూపానంద వద్దకు చేరుకొని  ఆశీస్సులు తీసుకొన్నారు. జగన్ ఇచ్చిన దండను స్వరూపానందస్వామి తీసుకొన్నారు.

స్వరూపానందస్వామి వద్ద జగన్ కూర్చొన్నారు. జగన్ ను స్వరూపానందస్వామి ఆప్యాయంగా దగ్గరకు తీసుకొన్నారు.  జగన్ ను ముద్దాడి తన ప్రేమను వ్యక్తం చేశారు. రాజశ్యామల అమ్మవారికి జగన్ ప్రత్యేక పూజలు చేయనున్నారు.

ఈ నెల 8వ తేదీన జగన్ తన మంత్రివర్గాన్ని కూడ విస్తరించనున్నారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ముహుర్తం గురించి కూడ జగన్ స్వరూపానందతో చర్చించే అవకాశం ఉంది.