Asianet News TeluguAsianet News Telugu

విశాఖ రామానాయుడు స్టూడియోస్ భూముల వ్యవహారం... మాజీ మంత్రి బండారు సంచలన వ్యాఖ్యలు

స్కాముల్లో  జగన్ రెడ్డి ఆరితేరిపోయారని టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి ఆక్షేపించారు. గురువారం ఉదయం జిల్లా తెలుగుదేశం కార్యాలయంలో  మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ...  

First Published Apr 13, 2023, 5:11 PM IST | Last Updated Apr 13, 2023, 5:11 PM IST

స్కాముల్లో  జగన్ రెడ్డి ఆరితేరిపోయారని టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి ఆక్షేపించారు. గురువారం ఉదయం జిల్లా తెలుగుదేశం కార్యాలయంలో  మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ...  ఫిల్మ్ అవసరాల కోసం విశాఖలో రామానాయుడు స్టూడియో కి ఎకరా 20 లక్షల చొప్పున 54 ఎకరాలు టీడీపీ హయాంలో ఇచ్చామని, గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో అడ్డుకోవాలని చూసారు కాని అది జరగలేదని... ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చిన  దగ్గర్నుంచి రామానాయుడు స్టూడియో స్ధలంపై కన్ను పడిందని ఆయన ఆరోపించారు. ఇపుడు 17 ఎకరాలు జీవీఎంసీ కమిషనర్ కి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోందని, అన్నారు దగ్గుబాటి సురేష్ జీవీఎంసీ కమిషనర్ కి మార్ట్ గేజ్ ఎలా ఇస్తారు అని ప్రశ్నించారు అసలు దీని ఆంతర్యం ఏంటి తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు