Asianet News TeluguAsianet News Telugu

కాంట్రాక్ట్ కార్మికుల ఆకలి గోష పట్టదా?: సిఐటియు నాయకుల ఆందోళన

జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న గుంటుపల్లి రైల్వే కాంట్రాక్టు మహిళా కార్మికుల పట్ల కాంట్రాక్టర్లు నిరక్ష్యంపై రాష్ట్ర హోం మంత్రి , మహిళా కమీషన్ చైర్మన్ వెంటనే స్పందించాలని సిఐటీయూ కార్యదర్శి మహేష్ డిమాండ్ చేశారు. 

జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న గుంటుపల్లి రైల్వే కాంట్రాక్టు మహిళా కార్మికుల పట్ల కాంట్రాక్టర్లు నిరక్ష్యంపై రాష్ట్ర హోం మంత్రి , మహిళా కమీషన్ చైర్మన్ వెంటనే స్పందించాలని సిఐటీయూ కార్యదర్శి మహేష్ డిమాండ్ చేశారు. డైనమిక్ ఎంటర్ ప్రైజెస్ కాంట్రాక్టర్ నిరక్ష్యం వల్లే కార్మికులు నెల నెల ఇబ్బందులు పడుతున్నారని... రైల్వే అధికారులు, జిల్లా కలెక్టర్, మండల రెవెన్యూ అధికారి వెంటనే  స్పందించి కార్మికులకు జీతాలు ఇప్పించాలని కోరారు. ముఖ్యంగా మహిళలకు పని ప్రదేశాలో కనీస సౌకర్యాలు కల్పించటం లేదని, కాంట్రాక్ట్ సంస్థకు చెందినవారు మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని సీఐటియు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో గుంటుపల్లి  రైల్వే కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ కార్యదర్శి పద్మావతి , వర్కర్స్ యూనియన్ నాయకులు రాణి , వెంకటేష్, బుజ్జి, ఆదిలక్ష్మి, సామ్రాజ్రం, నాయక్, సురేష్, చక్రవర్తి తదితరులు పోల్గోన్నారు.