Asianet News TeluguAsianet News Telugu

విజయవాడలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు... విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్న చర్చీలు

విజయవాడ : ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టియన్లు యేసు క్రీస్తును ప్రార్థిస్తూ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. 

First Published Dec 25, 2022, 10:04 AM IST | Last Updated Dec 25, 2022, 10:04 AM IST

విజయవాడ : ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టియన్లు యేసు క్రీస్తును ప్రార్థిస్తూ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇలా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోనూ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని చర్చీలన్ని కళకళలాడుతున్నాయి. క్రైస్తవులంతా ఉదయం నుండే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటూ యేసు క్రీస్తును ఆరాదిస్తున్నారు. క్రిస్మస్ పండగకోసం నగరంలోని ప్రధాన చర్చీలను విద్యుత్ దీపాలతో, క్రిస్మస్ ట్రీలతో సుందరంగా అలంకరించారు. ఇక యేసు ప్రభువు జీవితాన్ని వివరించేలా బొమ్మల కొలువు, ప్రత్యేక పాటలు చర్చీలకు వచ్చిన క్రైస్తవులను అలరిస్తున్నాయి.  ప్రత్యేక ప్రార్ధనల అనంతరం చిన్నా పెద్ద ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు.