చంద్రబాబుకు క్రైస్తవుల సెగ: మైలవరంలో ర్యాలీ
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు నిరసనగా క్రైస్తవ సంఘాలు రోడ్డెక్కాయి.
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు నిరసనగా క్రైస్తవ సంఘాలు రోడ్డెక్కాయి. హిందూ, ముస్లిం,క్రైస్తవ సోదరులు కలిసి మెలిసి జీవస్తుంటే వివాదాస్పద వ్యాఖ్యలతో మతాల మధ్య చిచ్చు పెట్టేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు క్రైస్తవ,దైవ సంఘాల సేవకులు.నియోజకవర్గ క్రైస్తవ సంఘాల నేతల ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా మైలవరం బస్ స్టాండ్ నుండి క్రైస్తవులు ర్యాలీ నిర్వహించారు.చంద్రబాబు క్రైస్తవులకు క్షమాపణ చెప్పాలి లేదా తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్రైస్తవుల పట్ల వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు.