Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు దీక్షకు అనుమతించకపోవడానికి కారణమేంటంటే..: చిత్తూరు ఎస్పీ

తిరుపతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దీక్షకు అనుమతివ్వకపోవడం, తాజాగా రేణిగుంట విమానాశ్రయంలో ఆయనను పోలీసులు నిర్బంధించడంపై చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ స్పందించారు. 

తిరుపతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దీక్షకు అనుమతివ్వకపోవడం, తాజాగా రేణిగుంట విమానాశ్రయంలో ఆయనను పోలీసులు నిర్బంధించడంపై చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ స్పందించారు. కోవిడ్ నిబంధనలు, ఎన్నికల కోడ్ దృష్ట్యా తక్కువ సంఖ్యలో జనాలతో ప్రచారం చేసుకోవచ్చు కాని నిరసన, ధర్నా లాంటి కార్యక్రమలకు అనుమతి లేదని ఎస్ఈసి తేల్చి చెప్పిందన్నారు. అంతేకాకుండా గాంధీ సర్కిల్ జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉన్నందున , ప్రజలు ఇబ్బందులు పడకుండ అక్కడ నిరసనకు అనుమతి ఇవ్వలేదన్నారు. నిన్న టిడిపి పార్టీ శ్రేణులు అనుమతి కోరినప్పుడు గాంధి సర్కిల్ కాకుండా నగర శివారు ప్రాంతాలలో నిరసన తెలియజేయాలని సూచించామని... కానీ వారు గాంధీ సర్కిల్ వద్ద మాత్రమే చేస్తామని అనడంతో అనుమతి నిరాకరించామని ఎస్పీ తెలిపారు.  టిడిపి శ్రేణులకు ఎస్ఈసీ అనుమతి తీసుకోమని సూచించామన్నారు. శాంతి భద్రలకు ఎవరు విఘాతం కల్పించినా ఉపేక్షించేది లేదని... ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకూడదని ఉద్దేశ్యంతోనే ముందస్తు చర్యల్లో భాగంగా తేదేపా నేతలను గృహ నిర్బదం చేయడం జరిగిందన్నారు. బెదిరింపులు , దౌర్జన్యాలు గురించి తెదెపా నేతలు , అభ్యర్దులు నుండి ఎలాంటి ఫిర్యాదులు అందలేవని ఎస్పీ పేర్కొన్నారు.  

Video Top Stories