వరదలపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
గోదావరి వరదల కారణంగా తలెత్తిన పరిస్థితులను ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ అధికారులతో సమీక్షించారు.
గోదావరి వరదల కారణంగా తలెత్తిన పరిస్థితులను ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ అధికారులతో సమీక్షించారు. తీసుకోవాల్సిన చర్యలపై వారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ముంపు బాధితులను ఆదుకోవడంలో ఉదారంగా వ్యవహరించాలని, ఖర్చుకు వెనకాడవద్దని కలెక్టర్లను ఆదేశించారు. కోవిడ్‌ను కూడా దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలన్నారు. విపత్తు నిర్వహణా బృందాలను అవసరమైన చోట్ల పెట్టుకోవాలన్నారు.