కుప్పం చరిత్రలోనే చీకటి రోజు, అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ను ధ్వంసం చేయడం నీచం.. చంద్రబాబు
చిత్తూరు జిల్లా : కుప్పంలో రెండో రోజు టిడిపి అధినేత నారా చంద్రబాబు పర్యటనతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
చిత్తూరు జిల్లా : కుప్పంలో రెండో రోజు టిడిపి అధినేత నారా చంద్రబాబు పర్యటనతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైసిపి నేతలు, కార్యకర్తలు చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్ ను ధ్వంసం చేశారు. దీనిమీద చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రగా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి అన్న క్యాంటీన్ కు వరకు వచ్చారు. వైసిపి నేతల చర్యలకు నిరసనగా....అన్న క్యాంటీన్ వద్ద రోడ్డుపై బైఠాయించి చంద్రబాబునాయుడు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ ఈ రోజు కుప్పం చరిత్రలో ఒక చీకటి రోజని అన్నారు. అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ను ధ్వంసం చెయ్యడం నీచం అని, వీధి కొక రౌడీని తయారు చేసి ప్రజలపైకి ఉసిగొల్పుతున్నారన్నారు.