Asianet News TeluguAsianet News Telugu

అభివృద్ది పనులపై జగన్ కు చంద్రబాబు చాలెంజ్

నెల్లూరు టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద సెల్ఫీ దిగి ఇళ్ల నిర్మాణంపై సీఎం జగన్ కు చాలెంజ్ విసిరారు  చంద్రబాబు.  

First Published Apr 8, 2023, 10:04 AM IST | Last Updated Apr 8, 2023, 10:04 AM IST

నెల్లూరు టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద సెల్ఫీ దిగి ఇళ్ల నిర్మాణంపై సీఎం జగన్ కు చాలెంజ్ విసిరారు  చంద్రబాబు.  చూడు....జగన్! ఇవే మా ప్రభుత్వ హాయాంలో పేదలకు నాడు నెల్లూరు లో కట్టిన వేలాది టిడ్కో ఇళ్లు....రాష్ట్రంలో నాడు కట్టిన లక్షల టిడ్కో ఇళ్లకు ఇవే సజీవ సాక్ష్యం అన్నారు. ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని..నువ్వు కట్టిన ఇళ్లెక్కడ...జవాబు చెప్పగలవా? అంటూ జగన్ కు ట్యాగ్ చేస్తూ సెల్ఫీ ఫోటో తో చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. తన మైబైల్ ఫోన్ తో స్వయంగా నెల్లూరు టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద సెల్ఫీ దిగి చాలెంజ్ విసిరారు. రాష్ట్రంలో నాటి అభివృద్ధి పనులపై ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసరాలని ఇప్పటికే క్యాడర్ కు, లీడర్స్ కు  చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. నాడు చేసిన అభివృద్ది పనులతో పాటు....నేడు ఉన్న సమస్యలను చాటి చెప్పేలా సెల్ఫీలు తీసి చాలెంజ్ విసరాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాడర్ కు చంద్రబాబు పిలుపు నిచ్చారు.