Andhra News:పుట్టినరోజునే ప్రజాక్షేత్రంలోకి... మహిళలతో కలిసి చంద్రబాబు సహపంక్తి భోజనం
ఏలూరు: టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజు నుండే రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజాక్షేత్రంలోకి దిగారు.
ఏలూరు: టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజు నుండే రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజాక్షేత్రంలోకి దిగారు. నిన్న(బుధవారం) 73వ జన్మదినోత్సవం సందర్భంగా చంద్రబాబు ఏలూరు జిల్లాలో పర్యటించారు. ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగుడెం గ్రామస్తులు, టిడిపి నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసారు. గ్రామస్తులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేసారు. మహిళలతో కలిసి భోంచేస్తూ వారికి స్వయంగా ఆహార పదార్థాలు అందించారు చంద్రబాబు.