Asianet News TeluguAsianet News Telugu

కోడెల ఆత్మహత్యకు కారణం చంద్రబాబే : మంత్రి అంబటి రాంబాబు

టీడీపీ అధినేత చంద్రబాబుకి మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు సత్తెనపల్లి సభ అట్టర్‌ ప్లాప్‌ అయిందని అన్నారు. 

First Published Apr 27, 2023, 2:19 PM IST | Last Updated Apr 27, 2023, 2:19 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబుకి మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు సత్తెనపల్లి సభ అట్టర్‌ ప్లాప్‌ అయిందని అన్నారు. సత్తెనపల్లి  లో మంత్రి అంబటి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘సత్తెనపల్లి సభకు జనం రాకపోయినా అద్భుతం అనడం చంద్రబాబు ఖర్మ. చంద్రబాబు సభకు జనం నుంచి స్పందన కరువైంది. చంద్రబాబు ఒక ముసలి సైకో. అధికారం లేకుండా ఉండలేని సైకో చంద్రబాబు. ఆయన ఒక్క నిజమైనా చెప్పారా.. అన్నీ అబద్ధాలే. చంద్రబాబును మించిన సైకో ఈ రాష్ట్రంలో ఎవరూ లేరు. రెక్కల కష్టంలో పార్టీని నిలబెట్టిన జగన్‌ అనర్హులా?. చంద్రబాబు, నారా లోకేష్‌ మాత్రమే అర్హులా?  అన్ని ప్రశ్నించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు.. నువ్వు పేదల్ని ధనవంతుల్ని చేశావా?.  కోడెల శివప్రసాద్‌ ఆత్మహత్యకు చంద్రబాబే కారణం. అన్ని అన్నారు.  గుండెల మీద చెయ్యి వేసి చెబుతున్నా.. బాబు కన్నా, లోకేష్ కన్నా, కోడెల కన్నా నీతిమంతుడినని అంబటి రాంబాబు అన్నారు. తనకు, తన సోదరుడికి మధ్య గ్యాప్ వచ్చిందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. చంద్రబాబుకు, ఆయన తమ్ముడికి మధ్య ఉన్నదే చిదంబర రహస్యం అంటూ ధ్వజమెత్తారు.