పవిత్రమైన శివాలయంలో చికెన్... పెదకాకానిలో తీవ్ర ఉద్రిక్తత
గుంటూరు: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఆలయంలోనే మాంసాహారం వండటం గుంటూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. పెదకాకాని పట్టణంలోని ప్రాచీన భ్రమరాంబ మల్లేశ్వర స్వామి సన్నిధిలో క్యాంటిన్ నడిపిస్తున్న అన్యమతస్తుడొకరు చికెన్ వండి నగరంలోని వేరువేరు ప్రాంతాలను తరలిస్తున్నట్లు ఇటీవల బయటపడింది. దీంతో ఈ ఘటనపై హిందూ సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసిపి ప్రభుత్వం హిందూ మతాచారాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందంటూ టిడిపి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర ఛలో పెదకాకానికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఇవాళ టిడిపి శ్రేణులతో కలిసి శివాలయానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, టిడిపి శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఆయన శివాలయం డీసీ ఛాంబర్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.