ఏలూరు జిల్లాలో లాకప్ డెత్... పోలీస్ స్టేషన్ బాత్రూంలో చెయిన్ స్నాచర్ ఆత్మహత్య
ఏలూరు: దొంగతనం కేసులో అరెస్టయిన ఓ నిందితుడు పోలీసుల అదుపులో వుండగానే మృతిచెందిన ఘటన ఏలూరు జిల్లా బీమడోలులో చోటుచేసుకుంది.
ఏలూరు: దొంగతనం కేసులో అరెస్టయిన ఓ నిందితుడు పోలీసుల అదుపులో వుండగానే మృతిచెందిన ఘటన ఏలూరు జిల్లా బీమడోలులో చోటుచేసుకుంది. మూడురోజుల క్రితం సూరప్పగూడెంకు చెందిన మడిపల్లి అప్పారావు(38)ను గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నాడని పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే బుధవారం పోలీస్ స్టేషన్ లోని బాత్రూంలో అతడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతడి మృతదేహాన్ని పోలీసులు ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఈ లాకప్ డెత్ కు పోలీసులు కారణమా లేక నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా అన్నది తేలాల్సి వుంది.