వద్దంటే వినకుండా పోయి.. చెరువులో పడ్డారు..
అనంతపురం జిల్లా, గుత్తిలోని చెరువుకట్టను దాటబోయి ఓ కారు, అందులోని ఇద్దరు వ్యక్తులు నీటిలోకి జారిపోయారు.
అనంతపురం జిల్లా, గుత్తిలోని చెరువుకట్టను దాటబోయి ఓ కారు, అందులోని ఇద్దరు వ్యక్తులు నీటిలోకి జారిపోయారు. భారీ వర్షాల కారణంగా అనంతపురంలో చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఆ దారిలో వెళ్లడం ప్రమాదం కొంచెం ఉదృత తగ్గేవరకు ఆగమని స్థానికులు చెబుతున్నా కారులో కడపనుండి బళ్లారికి వెడుతున్న రాకేష్, యూసఫ్ అనే ఇద్దరు యువకులు వినిపించుకోలేదు. బస్సు వెడుతోందని దాని వెనకే బయల్దేరారు. మధ్యలోనే కారు రోడ్డు మీదినుండి నీటిలోకి జారిపోయింది. స్థానికులు వెంటనే అప్రమత్తమవ్వడంతో ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు.