ఏపీలో మండుటెండలు... విజయవాడ నడిరోడ్డుపై కారులో మంటలు
విజయవాడ: తెలుగురాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు ప్రమాదానికి దారితీస్తున్నాయి.
విజయవాడ: తెలుగురాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు ప్రమాదానికి దారితీస్తున్నాయి. తాజాగా విజయవాడ బుడమేరు వంతెన వద్ద కారు దగ్ధమయ్యింది. కారులోంచి పొగలు రావడంతో వెంటనే అప్రమత్తమై కారులోనివారు కిందకుదిగడంలో ప్రమాదం తప్పింది. అయితే కారుల మంటల్లో చిక్కుకోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు కూడా భయంతో పరుగుపెట్టారు. ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఎలాంటి ప్రమాదం జరక్కుండా చూసుకుని... ట్రాఫిక్ ను కూడా కంట్రోల్ చేసారు.