Asianet News TeluguAsianet News Telugu

మంటలు ఎగసిపడుతూ, నల్లటి పొగలు అలుముకుని... నడిరోడ్డుపైనే కాలిబూడిదైన కారు

విశాఖపట్నం : కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి నడిరోడ్డుపైనే కాలి బూడిదైన ఘటన విశాఖపట్నం శివారులో చోటుచేసుకుంది.

First Published Aug 11, 2023, 7:01 PM IST | Last Updated Aug 11, 2023, 7:01 PM IST

విశాఖపట్నం : కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి నడిరోడ్డుపైనే కాలి బూడిదైన ఘటన విశాఖపట్నం శివారులో చోటుచేసుకుంది.  జాతీయ రహదారిపై దూసుకెళుతున్న ఓ కారు  వెంకోజిపాలెం మెడికవర్ హాస్పిటల్ సమీపంలో మంటల్లో చిక్కుకుంది. కారు ఇంజన్ నుండి పొగలు రావడంతో అందులోనివారు జాగ్రత్తపడ్డారు.వెంటనే కారును రోడ్డుపక్కకు తీసుకుని కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ పఘకారు ఇంజన్ లో మంటలు మొదలై క్షణాల్లోనే మొత్తం వ్యాపించాయి. దట్టమైన మంటలతో పాటు నల్లటి పొగలు అలుముకోవడంతో భయానక వాతావరణ నెలకొంది. మంటల్లో కారు పూర్తిగా దగ్దమయిపోయింది. దీంతో ఇరువైపుల వాహనాలు నిలిచిపోవడంతో హనుమంతవాక్ దగ్గర నుండి ఇసకతోట జక్షన్ వరకూ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.