రేపల్లెలో ఘోరం... మంటలు చెలరేగి రోడ్డుపైనే కారు, బైక్ దగ్దం
రోడ్డు ప్రమాదానికి గురయిన కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి బైక్ తో సహా దగ్దమైన ఘటన బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది.
రోడ్డు ప్రమాదానికి గురయిన కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి బైక్ తో సహా దగ్దమైన ఘటన బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది. రేపల్లె మండలం పేటేరు గ్రామంలో బుధవారం అర్ధరాత్రి కారు అదుపుతప్పి బైక్ ను ఢీకొట్టింది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా మంటలు చెలరేగి రెండు వాహనాలు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే బైక్ వెళుతున్న కట్టుపల్లి విజయ రాజు, రత్నకుమారి గాయపడగా గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.