రాజధాని రైతుల జనభేరీ సభ... మోహరించిన 2200 పోలీసులు
గుంటూరు: గురువారం రాయపూడి సీడ్ యాక్సెస్ రోడ్డులో అమరావతి జేఏసీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది.
గుంటూరు: గురువారం రాయపూడి సీడ్ యాక్సెస్ రోడ్డులో అమరావతి జేఏసీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. రాజధాని రైతుల ఆందోళనలు ఏడాదికి చేరిన నేపథ్యంలో జనభేరి పేరుతో భారీ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు ప్రతిపక్ష నేత చంద్రబాబు తో పాటు కాంగ్రెస్, జనసేన, వామపక్షాలు, బిజెపి నేతలు హాజరు అవుతున్నారు. ఇలా
రాజకీయ పార్టీల ముఖ్యనేతలతో పాటు భారీగా రాజధాని రైతులు హాజరు అవుతుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 2200మందితో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. రాయపూడి వై జంక్షన్ వద్ద భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.