కదంతొక్కిన అమరావతి రైతులు... వెంకన్న సన్నిధినుండే వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర షురూ
అమరావతి : అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు, మహిళలు గత వెయ్యిరోజులుగా ఆందోళన చేపటున్నారు.
అమరావతి : అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు, మహిళలు గత వెయ్యిరోజులుగా ఆందోళన చేపటున్నారు. ఇందులో భాగంగానే రాజధాని రైతులు అమరావతిలోని వెంకటపాలెం వెంకటేశ్వరస్వామి ఆలయం నుండి శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి ఆలయానికి మహా పాదయాత్ర చేపట్టారు. హైకోర్టు అనుమతితో ఈ పాదయాత్ర ఇవాళ (సోమవారం) అమరావతిలో ప్రారంభమయ్యింది. రైతుల పాదయాత్రకు ప్రతిపక్షాలు టిడిపి, బిజెపి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ కూడా మద్దతు తెలియజేసాయి. ఈ పాదయాత్ర ద్వారా తమకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఉత్తరాంధ్ర ప్రజలకు వివరిస్తామంటుని రైతులు అంటున్నారు. వెయ్యి కిలోమీటర్ల మేర రైతుల పాదయాత్ర సాగుతుంది.