Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో కుప్పకూలిన బస్ షెల్టర్... తప్పిన పెను ప్రమాదం

విశాఖపట్నంలో పెను ప్రమాదం తప్పింది. నగర ప్రజల సౌకర్యార్థం జివిఎంసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మోడల్ బస్ షెల్టర్ కుప్పకూలిపోయింది. 

First Published Aug 27, 2023, 3:53 PM IST | Last Updated Aug 27, 2023, 3:53 PM IST

విశాఖపట్నంలో పెను ప్రమాదం తప్పింది. నగర ప్రజల సౌకర్యార్థం జివిఎంసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మోడల్ బస్ షెల్టర్ కుప్పకూలిపోయింది. అయితే ఈ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇంత జరిగినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని... పడిపోయిన షెల్టర్ పైకప్పునే  తిరిగి అమరుస్తున్నారని సిపిఎం నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ వామపక్షాలు, జనసేన పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలో పలు చోట్ల ఇదే తరహా బస్ బే ల నిర్మాణాలు చేపట్టడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.