Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో కేసీఆర్ పార్టీ ... బిఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడి పేరిట ప్లెక్సీలు, హోర్డింగ్స్

విజయవాడ : తెలంగాణ నిధులు, నీళ్లు, నియామకాలు ఆంధ్రోళ్ల పాలవుతున్నాయంటూ ప్రత్యేక రాష్ట్రంకోసం ఏర్పడిన టీఆర్ఎస్ ఇప్పుడు బిఆర్ఎస్ గా రూపాంతరం చెందింది.

First Published Dec 11, 2022, 10:01 AM IST | Last Updated Dec 11, 2022, 10:01 AM IST

విజయవాడ : తెలంగాణ నిధులు, నీళ్లు, నియామకాలు ఆంధ్రోళ్ల పాలవుతున్నాయంటూ ప్రత్యేక రాష్ట్రంకోసం ఏర్పడిన టీఆర్ఎస్ ఇప్పుడు బిఆర్ఎస్ గా రూపాంతరం చెందింది. దీంతో ఆంధ్రోళ్లకు వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో పాగా వేసేందుకు సిద్దమయ్యింది. ముందుగా దక్షిణాదిన బిఆర్ఎస్ ను విస్తరించాలని బావిస్తున్న కేసీఆర్ పొరుగు తెలుగురాష్ట్రం ఏపీలో బిఆర్ఎస్ కార్యాలయ ఏర్పాట్లుకు సన్నహాలు చేస్తున్నారు. విజయవాడలోని జక్కంపూడి ఇన్నర్ రింగ్ రోడ్డు హైవేపై బిఆర్ఎస్ కార్యాలయ ఏర్పాటుకు 800 గజాల స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ నెల  18,19 తేదీల్లో ఈ స్థలాన్ని పరిశీలించనున్నట్లు సమాచారం. అంతా ఓకే అయితే త్వరలోనే విజయవాడలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటుకానుంది. 

ఇదిలావుంటే ఇప్పటికే బిఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడి పేరిట ప్లేక్సీలు, బ్యానర్లు వెలిసాయి. కోణిజేటి ఆదినారాయణను భారతీయ రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షుడు, విజయవాడలో బిఆర్ఎస్ కార్యాలయం అంటూ ప్లెక్సీల ప్రదర్శన ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. అలాగే విజయవాడలోని బందర్ రోడ్డు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద కొందరు నాయకులు బిఆర్ఎస్ పార్టీ పేరిట భారీ హోర్డింగ్ ఏర్పాటుచేసారు.